28
దావీదు కీర్తన. 
 1 యెహోవా, నీవే నా అండవు. 
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను. 
నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు. 
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే 
అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను. 
 2 యెహోవా, నేను నా చేతులు ఎత్తి, నీ అతి పవిత్ర స్థలం వైపు ప్రార్థిస్తున్నాను. 
నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము. 
నా మీద దయ చూపించుము. 
 3 యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము. 
ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”* షాలోం అనగా శాంతి అని అర్థం. అని అభినందిస్తారు. కానీ వారి హృదయాల్లో వారి పొరుగు వారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వైస్తున్నారు. 
 4 యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు. 
కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము. 
ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము. 
 5 యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు. 
ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు. 
వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు. 
 6 యెహోవాను స్తుతించండి. 
కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు. 
 7 యెహోవా నా బలం ఆయనే నా డాలు. 
నేను ఆయనను నమ్ముకొన్నాను. 
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. 
మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను. 
 8 యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు. 
ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి† ఏర్పాటు చేసుకొన్నవానికి అభిషేకించబడ్డ వానికి సాధారణంగా ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజు. శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు. 
 9 దేవా, నీ ప్రజలను రక్షించుము. 
నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము. 
కాపరిలా వారిని నిత్యం నడిపించుము.