యాకోబు రాస్తి ఉత్రం
నెల్వకిబిసినిక
యా ఉత్రం రాస్తి యాకోబు ప్రబుఆతి యేసుఙ్ తంబెర్‌సి ఆతికాన్. యాకోబు యెరుసలేమ్‌దు మన్ని సఙమ్‌ది పెద్దెలిఙ లొఇ ఒరెన్. యాక రాస్తి కాలం రమారమి క్రీస్తు సకం 45 దాన్ 50 నడిఃమి కాలమ్‌దు రాస్త మనాన్. యా ఉత్రమ్‌దు ముకెలమాతిక నమకమ్‌దిఙ్ రుజుప్ కినికాదె. నమకం నిజమాతికదొ ఆఏదో ఇజి ఎలాగ నెస్తెఙ్ ఇజి రాస్త మనాన్.
1
1 దేవుణుదిఙ్‌ని, ప్రబు ఆతి యేసు క్రీస్తుఙ్, సేవకినికానాతి యాకోబు, ఆఇ దేసెమ్‌కాఙ్ సెద్రితి మని దేవుణు లోకాఙ్ విజేరిఙ్ రాసిని ఉత్రం. మిఙి విజేరిఙ్ వందనమ్‌కు.
మాలెఙ్ వానివలె అక్కెఙ్ ఓరిస్తెఙ్‌వలె
2-3 నాను ప్రేమిసిని తంబెరిఙండె, నండొ మాలెఙ్ వానివలె మీరు సర్‌దదాన్ మండ్రు. ఎందనిఙ్ ఇహిఙ, మాలెఙ్ వానివలె యేసుప్రబు ముస్కు మన్ని నమకం డిఃస్‌ఎండ మహిఙ, మాలెఙ్ బిరిస్తెఙ్ మిఙి సత్తు మనాద్ ఇజి దినివలెహాన్ రుజుప్ వానాద్. 4 మీరు కిజిని పణిదు డిఃస్‌ఏండ ఓరిసి మండ్రు. అయాలెకెండ్ కితిఙ మీరు కస్టం బరిస్నిదన్ని లొఇ పూర్తి ఆతికిదెర్ ఆనిదెర్. అయావెలె మీ గుణమ్‌దు ఇనికబా తక్కు సిల్లెండ మంజినిదెర్. 5 మీ లోఇ ఎయెఙ్‌బా గెణం తక్కు మహిఙ, వాండ్రు దేవుణుదిఙ్ లొస్తెఙ్. దేవుణు వన్నిఙ్ సీనాన్. ఎందానిఙ్ లొసినార్ ఇజి కోపం ఆఏండ దేవుణు విజేరిఙ్ తక్కు సిల్లెండ సీనాన్. 6 గాని, వాండ్రు కండెక్‌బా అనుమానం సిల్లెండ నమకమ్‌దాన్ దేవుణుదిఙ్ లొస్తెఙ్. ఎందానిఙ్ ఇహిఙ అనుమానం ఆనికాన్ గాలిదాన్ ఎగ్రిని సమ్‌దరమ్‌ది ఉల్కెలెకెండ్ తూల్జి అర్ని జోఙ్నివజ ఆనాన్. 7-8 అనుమానం ఆనికాన్ దేవుణు బాణిఙ్ ఇనికబా దొహ్‌క్నాద్‌సు ఇజి ఒడ్ఃబినిక ఆఎద్. అనుమానం ఆనికాన్ రుండి మన్సుఙ్ ఆజి ఇనిదన్ని లొఇబా స్తిరం సిల్లికాన్. 9 దేవుణుదిఙ్ నమ్మితి బీదవాండ్రు, దేవుణు వన్నిఙ్ పెరికాన్ కిత్తిఙ్ సర్‌ద ఆజి మండ్రెఙ్. 10 అయావజనె ఆస్తి మనికాన్, వన్నిఙ్ కల్‌గితిక తక్కు ఆజి ఇజిరికానాతిఙ్‌బా సర్‌ద ఆజి మండ్రెఙ్. ఎందానిఙ్ ఇహిఙ ఉండ్రి గడ్డి పూఙు వెటనె రాల్నివజ, ఆస్తి మనికాన్ ఆహె ఆన సొనాన్ ఇజి వాండ్రు నెస్నాన్. 11 పొద్దు సోసి నండొ ఎండ కిత్తిఙ గడ్డి వహ్న సొనాద్, పూఙు రాల్న సొనాద్. అయ పూఙు సోకు విజు పాడాఃన సొనాద్. అయావజనె గణస్తెఙ్ కిని పణిలొఇ ఆస్తి మన్నికాన్ సిల్లెండ ఆనాన్లె. 12 మాలెఙ్ వానివలె దేవుణు ముస్కు నమకం డిఃస్‌ఎండ అక్కెఙ్ బరిస్నికాన్ సర్ద ఆనాన్. మాలెఙ్ విజు బిరిస్తి వెనుక దేవుణుఙ్ ప్రేమిస్తివరిఙ్ సీనా ఇజి ఒట్టు కిత్తి ఎలాకాలం బత్కిని బత్కు ఇని ఇనాయం దేవుణు సీనాన్.
13 తప్పుపణి కిదెఙ్ మన్సుద్ వాతివెలె, అక్క దేవుణు సిత్తిక ఇజి ఎయెన్‌బా వెహ్నిక ఆఎద్. ఎందానిఙ్ ఇహిఙ సెఇ దన్నిదటాన్ దేవుణు తప్పుపణి కిబిస్తెఙ్ అట్‌ఏన్. తప్పుపణి కిబిస్తెఙ్ దేవుణు ఎయెరి మన్సుదుబా ఆస పుటిస్‌ఎన్. 14 గాని ఒరెన్ ఒరెన్ వన్ని సొంత మన్సుదాన్ మన్ని ఆసదాన్ మర్‌జి లాగె ఆజి సెఇ పణి కిజినాన్. 15 తప్పుకిదెఙ్ మన్ని ఆస ఎలాగ ఇహిఙ అయ్‌లికొడొః పొటాద్ పిండెం ఆతిలెకెండె అయాక పిరితివలె ఏరు ఈబాజినాద్. అయాలెకెండ్ ఒరెన్ మన్సుదు సెఇ ఆస నండొ ఆజి పాపం పుట్నాద్. పాపం ముద్రితిఙ వన్నిఙ్ సావు వాజినాద్.
16 నాను ప్రేఇని తంబెరిఙండె, ఎయెర్‌బా మిఙి మోసెం కిఏండ సుడ్ఃదు. 17 నెగ్గికెఙ్ విజు, కల్తిసిల్లికెఙ్ విజు దేవుణు సీని ఇనాయమ్‌కునె. ఆగసమ్‌దు మన్ని జాయ్ విజు వుటిస్తి దేవుణుబాణిఙ్ నెగ్గికెఙ్ విజు వాజినె. జాయ్ సొన్సి నీడః వానాద్. గాని దేవుణు మార్‌ఇకాన్. 18 నిజమాతి వన్ని మాటదాన్ వాండ్రు తీర్మనం కిత్తిలెలెండ్ దేవుణు మఙి కొత్త బత్కు సిత్తాన్. ఎందానిఙ్ ఇహిఙ పుటిస్తి విజు వనకముస్కు దేవుణు మఙి వన్ని వందిఙ్ ఎర్లిసి ఇట్తాన్.
దేవుణు మాట వెంజి అయ మాటవజ నడిఃదెఙ్‌వలె
19 నాను ప్రేమిసిని తంబెరుఙాండె, యాక నెగ్రెండ వెండ్రు. ఒరెన్ ఒరెన్ బాగ వెంజి, వెహి వెటనె వర్‌గిఏండ, వెహి వెటనె కోపం ఆఎండ మండ్రెఙ్. 20 ఒరెన్ కోపం ఆతిఙ దేవుణుదిఙ్ ఇస్టమాతివజ నీతినిజయ్తిదాన్ పణి కిదెఙ్ అట్‌ఏన్. 21 అందెఙె మన్సుద్ నిండ్రితి సెఇకెఙ్ విజు డిఃసిసీజి, పిరిజివాని సెఇ అలవాటుఙ్ విజు డిఃసిసీజి, మిఙినె తగిసి దేవుణు మీ మన్సుదు ఇట్తి మాటెఙ లొఙిదు. దేవుణు మీ మన్సుదు ఇట్తి ఆ మాటెఙలొఇ, మిఙి గెల్పిస్తెఙ్ సత్తు మన్నె.
22 మీరు దేవుణు మాటెఙ్ వెండ్రెఙె ఆఎద్. దేవుణు మాట వెంజి అయ మాట వజ నడిఃదెఙ్‌బావలె. దేవుణు మాటెఙ్ వెంజి అయవజనె నడిఃఏండ మహిఙ మిఙి మీరె మొసెం కిజినిదెర్. 23 దేవుణు మాట వెంజి అయావజ నడిఃఇకాన్ అద్దమ్‌దు వన్ని మొకొం సుడ్ఃతి వన్నిలెకెండ్ మనాన్. 24 వాండ్రు అద్దమ్‌దు సుడ్ఃజి మర్‌జి సొహి వెటనె వన్ని మొకొం, ఎలాగ మర్తికదొ ఇజి పోసినాన్. 25 దేవుణు వెహ్తి పూర్తి ఆతి రూలుఙ్ లోకాఙ్ పాపమ్‌దాన్ డిఃస్పిస్నాద్‌లె. ఒరెన్ లోకు దేవుణు వెహ్తి అయ మాటెఙ్ విజు నెగ్రెండ సద్‌వీజి బాన్ మనికెఙ్ పోస్‌ఏండ అయావజనె వన్ని బత్కుదు నడిఃతిఙ, వాండ్రు కిని విజు పణిఙలొఇ దేవుణు వన్నిఙ్ దీవిస్నాన్.
26 ఎయెన్‌బా, నఙి దేవుణు ముస్కు నండొ బక్తి మనాద్ ఇజి వెహ్సి వెనుక, వన్ని నాలిక అడ్డు సిల్లెండ వర్‌గితిఙ వన్నిఙ్ మన్నిబక్తి విలువ సిల్లికాద్. వన్నిఙ్ వాండ్రె మొసెం కిబె ఆజినాన్. 27 మా బుబ్బాతి దేవుణు సుడ్ఃతిఙ నిజమాతి బక్తి ఇనిక ఇహిఙ, యాయ బుబ్బార్ సిల్లి కొడొఃరిఙ్, ముండ మణిసి ఆతి అయ్‌లికొడొఃకాఙ్ వరి కస్టమ్‌దు సాయం కిదెఙ్, దేవుణుదిఙ్ పడిఃఇ వనకలొఇ కూడ్ఃఏండ మండ్రెఙ్ ఇకాదె నిజమాతి బక్తి.