Home

కీర్తనల గ్రంథము

అధ్యాయం: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150


-Reset+

చాప్టర్ 106

1 యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
2 యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింప గలడు? ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు?
3 న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.
4 యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతో షించుచు
5 నీ స్వాస్థ్యమైనవారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపక మునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము.
6 మా పితరులవలెనే మేము పాపము చేసితివిు దోషములు కట్టుకొని భక్తిహీనులమైతివిు
7 ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగు బాటు చేసిరి.
8 అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయు టకై ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను.
9 ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలము లలో నడిపించెను.
10 వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను.
11 నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.
12 అప్పుడు వారు ఆయన మాటలు నమి్మరి ఆయన కీర్తి గానము చేసిరి.
13 అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.
14 అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి
15 వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను.
16 వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి.
17 భూమి నెరవిడిచి దాతానును మింగెను అది అబీరాము గుంపును కప్పివేసెను.
18 వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను.
19 హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి
20 తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపము నకు మార్చిరి.
21 ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను
22 ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.
23 అప్పుడు ఆయననేను వారిని నశింపజేసెదననెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను
24 వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి
25 యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి.
26 అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును
27 అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకునుఆయన వారిమీద చెయ్యి యెత్తెను.
28 మరియు వారు బయల్పెయోరును హత్తుకొని, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి.
29 వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను.
30 ఫీనెహాసు లేచి పరిహారముచేయగా ఆ తెగులు ఆగిపోయెను.
31 నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచ బడెను.
32 మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను.
33 ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.
34 యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి.
35 అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి.
36 వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను.
37 మరియు వారు తమ కూమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి.
38 నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను
39 తమ క్రియలవలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించినవారైరి.
40 కావున యెహోవా కోపము ఆయన ప్రజలమీద రగులుకొనెను ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను.
41 ఆయన వారిని అన్యజనులచేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి.
42 వారి శత్రువులు వారిని బాధపెట్టిరి వారు శత్రువులచేతి క్రింద అణపబడిరి.
43 అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగు బాటు చేయుచువచ్చిరి. తమ దోషముచేత హీనదశనొందిరి.
44 అయినను వారిరోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను.
45 వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.
46 వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను.
47 యెహోవా మాదేవా, మమ్మును రక్షింపుము మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నిన్నుస్తుతించుచు మేమతిశయించునట్లును అన్యజనులలోనుండి మమ్మును పోగుచేయుము.
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగము లన్నిటను స్తుతినొందును గాక ప్రజలందరుఆమేన్‌ అందురుగాక. యెహోవానుస్తుతించుడి.